Wednesday, December 5, 2012

My childhood association with Vuyyuru

ఉయ్యూరు మిత్రులకు అభినందనలు. వుయ్యూరు టైమ్స్ మాధ్యమము లభించినందుకు ఆనందముగా ఉంది. నా ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఏమి చెప్పదలచుకోలేదు. ఉయ్యురుతో పెనవేసుకున్న నా గత స్మృతులను నెమరేసుకునే ప్రయత్నము మాత్రమే ఇది. నా బాల్యమంతా ఉయ్యురులోనే గడచింది. నేను పుట్టింది ఏలూరులోని ఒక హాస్పిటల్ అయిన ఎక్కువ కాలం పెరిగింది ఉయ్యురులోనే. ఇంటర్మీడియట్ దాక నా చదువు ఉయ్యూరు లోని పలు చోట్ల జరిగింది. మొట్టమొదట ప్రభుత్వ ఎలెమెంటరీ స్చూల్లో జరిగింది. అది కాలేజీ దగ్గర ఉండేది. అప్పుడు కాలేజీ నడిచేది కాదు. చింత చెట్లు చేమలు మాత్రమే ఉండేవి. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది నేను ఎలెమెంటరీ స్కూల్ లో చదివేటప్పుడు పెన్సిల్స్ బాగా పారేసుకునేవాదినని. రోజుకో కొత్త పెన్సిల్ పారవేసుకునే వాడినట. ఆ తర్వాత కటకటాల మాస్టారు దగ్గర చదువుకున్నట్టు గుర్తు. ఆ తర్వాత సుబ్బారావు మాస్టారు దగ్గర 5th క్లాసు దాక చదువుకున్నాననుకుంట. తదుపరి ప్రభుత్వ జిల్లా పరిషత్ స్చూల్లో 10th వరకు చదివాను. నా చదువులు ఫరవాలేదు. మార్కులు బాగానే వచ్చేవి. పెద్దగ ఇబ్బంది పడలేదు. దుర్గాప్రసాదు మాస్టారి గారి అబ్బాయిగా స్కూల్ ఫస్ట్ రావాలనే ఒతిడి ఉండేది. దానిని చాల వరకు సాధించే వాడిని. చాల మంది మిత్రులు ఉండే వారు. పసుమర్తి శ్రీనివాస్, ఫణి, అజయ్, ప్రతాప్, రాజేంద్రప్రసాద్, నరసింహారావు, బ్రహ్మం, దుర్గారావు ఇంకా ఎంతో మంది. ఎవరితో పెద్దగా గొడవ పడిన సందర్భాలు ఏమి లేవు. స్కౌట్ గా ఉండేవాడిని. క్యాంపు లో భాగముగా బందరు, చెన్నై వెళ్ళాను. అప్పుడు అది పెద్ద విజయము. చెన్నై వెళ్ళినప్పుడు మొరార్జీ దేశాయి గారిని చూసాను. ఆయన అప్పుడు ప్రధాన మంత్రి. చెన్నై వెళ్ళినందుకు ప్రెసిడెంట్ స్కౌట్ పత్రము లభించింది. నీలం సంజీవరెడ్డి గారి సంతకముతో వచ్చింది. మార్కులు అయితే బాగా వచేవి కానీ నాయకత్వ లక్షణాలు పెద్దగ ఉండేవి కావు. క్లాసు లీడర్ గ నియమించినప్పటికీ నేను క్లాసు ను నిర్వహించాలేకపోఎవాడిని. ఎవ్వరు నా మాట వినేవారు కాదు. ఒక సందర్భములో ఏడ్చినట్టు గుర్తు. ఈ విషయములో ఇప్పటికి ఇంతే. హై స్కూల్ తర్వాత కాలేజీ లో ఇంటర్మీడియట్ చేరాను. ఇంగ్లిష్ మీడియం. బాగానే కొనసాగింది. రాజేంద్రప్రసాద్, నేను మరి కొంతమంది కలిసి యువభవ అనే చేతి వ్రాత పత్రిక తాయారు చేసే వాళ్ళము. రాజేంద్ర ప్రసాద్ చొరవ, కృషి ఎక్కువ. తనకు ఒక ఆర్టిస్ట్ మిత్రుడు ఎక్కువ సహాయము చేసేవాడు. కాలేజీ అయిపోయిన సాయంత్రాలలో ఎక్కువ రాజేంద్రప్రసాద్ ఇంట్లోనే ఎక్కువ గడిపేవాడిని. అలాగే అజయ్ తో కంబినేడ్ స్టడీస్ చేసేవాడిని. చదువుకు వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడిని. కాలేజీ లో క్రికెట్ ఆడేవాళ్ళము. బాట్ తో కొడుతుంటే కాలు ముందరికి వచెది. మంచి స్కోరు చేసిన గుర్తు లేదు. quiz పోటీలలో పాల్గొనే వాడిని. కాలేజీ కి ప్రాతినిధ్యము కుడా వహించాను. గుంటూరులో జరిగిన ఒక పోటీలో పాల్గొన్నాను కూడా. ఒక quiz పోటికి మాస్టర్ గ వ్యవహరించాను రాజేంద్రప్రసాద్ కోరిక మీద. ఒకసారి మాదాల కాసీ విశ్వేశ్వర రావు గారు నన్ను అకస్మాత్ గ తరగతి నుండి బయటకు పిలిచి చెంప చెల్లుమనిపించాడు. తరువాత మళ్ళీ పిలిచి క్షమాపణ చెప్పారు. నా మొదటి రంగస్థల ప్రవేశము వుయ్యూరు కాలేజీ లోనే జరిగింది. ప్రస్తుత ప్రముఖ సిని రచయితా పరుచూరి గోపాలకృష్ణ గారి సూచన మేరకు ఆడ పిల్ల వేషము వేసాను. బస్సు మిస్సు అనే ఆదివిష్ణు గారి నాటకంలో ఆడపిల్ల వేషం వేసాను. మంచి ప్రసంసలె వచాయి. ఆ తర్వాత మిత్రులందరం కలిసి డాక్టర్ ABCD అనే నాటకంలో కమెడియన్ గ వేషం వేసాను. బాగానే మెచుకున్నరు. నియాజ్ లెక్చరర్ గారు మాతో బాగా సన్నిహితముగా ఉండేవారు. దాసరి వెంకటేశ్వర రావు అనే సీనియర్ తోకూడ పరిచయం అయ్యింది. ఆయన రూం లో కూడా ఎక్కువ గడిపే వాళ్ళము. బాలతో కూడా అల పరిచయమయ్యింది. సిల్వర్ జూబిలీ కాలేజీ గురించి దాసరి నుండే తెలిసింది. డిగ్రీ పై చదువుల కోసము వుయ్యూరు వదిలి వెళ్ళినప్పటికి సెలవల్లో పాత మిత్రులు కొంత మంది ( బుర్ర వేణుగోపాల్, పిల్లి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శివ, కే వెంకట రమణ, సంపత్ మో ) కాటూర్ వీధిలో సాయంత్రం సమయాలలో కలిసి రాజకీయాల గురించి, సినిమా ల గురించి పిచ్చ పాటీ కబుర్లు చెప్పుకునే వాళ్ళము. అప్పుడప్పుడు తమ్ముడు శర్మ కూడా మాతో కలిసే వాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ సీతారామ స్టోర్స్ వెనక భాగంలో కుడా అనేక చర్చలు జరిగేవి. కొన్ని ఫ్రెండ్స్ సర్కిల్ కార్యక్రమాలలో పాల్గొన్నట్లు గుర్తు. హేతువాద సమావేశాలకు హాజరయ్యే వాళ్ళం. ప్రభుత్వ గ్రంధాలయం లోకి క్రమం తప్పకుండ వెళ్ళేవాడిని. పుస్తాకాలు చదవటం అప్పుడే అలవాటయ్యింది. లైబ్రరీ అలవాటు చాల కాలం కొనసాగింది. ఇలా వుయ్యురుతో నాకున్న అనుబంధం చిరస్మరణీయం.

No comments:

Post a Comment